![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -517 లో..... వల్లి ప్రెగ్నెంట్ అంతా ఒక నాటకమని రామరాజుకి తప్ప అందరికి తెలుస్తుంది. నువ్వు తల్లి కాబోతున్నావని ఇంట్లో అందరం ఆశపడ్డాము.. అసలు నీకు ఇలాంటి విషయాల్లో ఎలా మోసం చెయ్యాలనిపించిందని వల్లిపై వేదవతి కోప్పడుతుంది. నిన్ను నమ్మడం నాది తప్పు అని వేదవతి అంటుంది. అసలు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదని తన మెడ పట్టుకొని బయటకు లాక్కొని వస్తుంది. ఆ తర్వాత అందరు కలిసి భాగ్యం ఇంటికి వస్తారు. నీ కూతురిని పుంటింటికి ఇంటికి తీసుకొని వచ్చానని వేదవతి అనగానే భాగ్యం షాక్ అవుతుంది.
ఎంత మోసం చేశారు.. అసలు నువ్వు మనిషివేనా తప్పు మీద తప్పు చేస్తున్నావని వాళ్లపై వేదవతి కోప్పడుతుంది. వల్లి ఏడుస్తుంది.. అది కాదు వదిన అని భాగ్యం ఏదో చెప్పబోతుంటే.. అసలు వేదవతి వినదు. ఇక మీ అమ్మాయిని మీ దగ్గరే ఉంచుకోండి అని వేదవతి అంటుంది. అత్తయ్య అని వల్లి ఏడుస్తుంటే ఎందుకే వాళ్ళని బ్రతిమిలాడుతున్నావ్.. కోర్ట్ కి వెళదాం.. గృహహింస కేసు పెడుదామని భాగ్యం అనగానే అసలు మీలో తప్పు చేసాం అనే భావన కొంచెం కూడా లేదని నర్మద అంటుంది. ఏమైనా చేసుకోండి అందరు మిమ్మల్ని అంటారని వేదవతి అంటుంది. మరొకవైపు విశ్వ, అమూల్య కేసు గురించి లాయర్ దగ్గరికి వెళ్తాడు రామరాజు. ఎలాగైనా ఆ విశ్వకి శిక్ష పడేలా చేస్తామని లాయర్ అంటాడు. ఆ తర్వాత ఒరేయ్ చిన్నోడా.. మీ నాన్నకి ఫోన్ చెయ్ అంటాడు. రామరాజుకి ధీరజ్ ఫోన్ చేస్తాడు. వేదవతి ఫోన్ తీసుకొని మీకు వల్లి గురించి కొన్ని నిజాలు తెలియాలి.. భాగ్యం వదిన వాళ్ళింటికి రండీ అని వేదవతి అనగానే రామారాజు సరే అంటాడు.
ఇక రామరాజుకి నిజం తెలుస్తుందేమోనని భయంతో వల్లి అక్కడ బావిలో దూకుతుంది. వెంటనే ధీరజ్ దూకి వల్లిని సేవ్ చేస్తాడు. నన్ను ఎందుకు కాపాడారని వల్లి ఏడుస్తుంది. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని చందు అంటాడు. నువ్వు కావాలి బా అని వల్లి అంటుంది. మోసం చేసిన నీకు.. నన్ను కావాలనే అడిగే హక్కు లేదని చందు అంటాడు. ఊకో అమ్మా అని భాగ్యం అంటుంటే నోరు ముయ్ ఇదంతా నీ వల్లే వద్దు అమ్మా అని వల్లి అంటుంది. నేను చూసుకుంటా అని అన్నావని భాగ్యంపై వల్లి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |